- అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మి పురం పంచాయతీ లో గురువారం కొర్ర.త్రినాధ్ అద్యక్షతన గ్రామ సభ జరిగింది ,ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలు అమలు తీరుపై సమీక్ష జరిగింది,ప్రజలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత సిబ్బందితో సమాధానాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ కొర్ర త్రినాధ్ మాట్లాడుతూ కొత్త బియ్యం కార్డులు పించన్లు అర్హులందరికీ మంజూరు చేయాలని, కొత్త వారికి హెడింగ్ చేయాలని,ఆగిపోయిన అమ్మఒడి ఇవ్వలని ఆదేశించారు, కొత్త ఇల్లులు మంజూరు చేయాలని, పాత ఇ ల్లులకు బిల్లులు ఇవ్వలని డిమాండ్ చేశారు,ఎంపీటీసీ వి.సద్దురం మాట్లాడుతూ డ్రాప్ ఔట్ విద్యార్థులను బడిలో చేర్పించలని కోరారు,సెక్రటరీ బి.ప్రశాంత్ మాట్లాడుతూ 12 న జరిగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు,గ్రామాల్లో అనుసంధాన మటి రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, నాడు నేడు ద్వారా స్కూల్,అంగన్వాడి భవనాలు మంజూరు చేయాలని గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది,తీర్మానం అధికారులకు అందిస్తామని సెక్రటరీ చెప్పారు, ఇందులో ఉప సర్పంచ్ ఎ.సత్యం,డిఎ ఎస్.దేవేంద్రుడు,సచివాలయం సిబ్బంది శిరీష,గిరిజ రాణి,మాధవి,త్రినాధ్, వార్డు సభ్యులు హరి, త్రినాథ్,అంతతరం, సొద,వలెంటిర్లు సుబ్బారావు,సీతారాం,రాధ,అంగన్వాడి, ఆశా వర్కర్లు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు,
This post was created with our nice and easy submission form. Create your post!