- ప్రపంచ కాఫీ పోటీలలో 12 ఏళ్ల తరువాత గిరిజన కాఫీకి అవార్డు దక్కిందని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ అన్నారు.. సెప్టెంబరు 25 నుండి 29 వతేదీ వరకు బెంగుళూరు లో నిర్వహించిన ఫైన్ కప్ పోటీలలో ఐటిడిఏ. జిసిసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కాఫీ పెవివిలియన్ ఏర్పాటు చేసామన్నారు. ఈ పెవిలియన్లో భారత దేశం నుండి కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కాఫీ సాగు చేస్తున్న 10కిపైగా ఇతర దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. పెదబయలు మండలం లక్ష్మిపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఆర్గానిక్ కాఫీ సాగుచేసి కాఫీ పోటీలలో బెస్ట్ వాష్డ్ అరబికా అవార్డు ఫైన్ కప్ అవార్డు) సొంతం చేసుకున్నారని చెప్పారు. కాఫీ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. జి. కె. వీధి, జి.మాడుగుల మండలాల్లో రూ.7.50 కోట్లతో ఎకో కాఫీ పల్ఫింగ్ యూనిట్స్ నెలకొల్పుతున్నామని చెప్పారు.ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వేంకటేశ్వరరావు, కాఫీ సహాయ సంచాలకులు ఎన్ . అశోక్ తదతరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!