* ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు వెంటనే ప్రారంభించాలి* ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
గత వారం రోజులుగా ఆదోని మార్కెట్ యార్డ్ లో వేరుశనగ అమ్మకాలు(కొనుగోలు) నిలిచిపోయాయని, దీంతో రైతులు రవాణా ఖర్చు ఎక్కువ పెట్టుకుని ఎమ్మిగనూరు, కర్నూలు మార్కెట్ యార్డు కు వెళ్లి అమ్మకాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు వారి వేతనాల కోసం సమ్మె చేస్తే మార్కెట్ యార్డులో వేరుశనగ అమ్మకాలకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కమిషన్ ఏజెంట్లు వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అప్పో,సప్పో చేసి పంట పండించి, చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్ యార్డ్ లో కొనుగోలు నిలిచిపోవడం రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే మార్కెట్ యార్డ్ లో కొనుగోలు ప్రారంభించాలని, *మార్కెట్ యార్డ్ లో రైతులకు ఉచిత భోజన వసతి వెంటనే ప్రారంభించాలని* లేనిపక్షంలో రైతు సంఘంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
*మార్కెట్ యార్డ్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు*
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, మండల నాయకులు చిన్న తిక్కన్న, హనుమంత రెడ్డి, రామాంజనేయ లు, చిన్న తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!