in ,

సీఎం జగన్ దృష్టికి గిరిజన ప్రాంత సమస్యలు

పాడేరు, అల్లూరి జిల్లా: గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి గిరిజన ప్రాంత శాసనసభ్యులు బుధవారం తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం  జగన్మోహన్ రెడ్డి ని గిరిజన ప్రాంతం శాసనసభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన ప్రాంతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాము వెళ్ళినప్పుడు ప్రజలు తెలియజేసినటువంటి సమస్యలను, తాము స్వయంగా చూసిన వాటిని పరిష్కరించాలని కోరుతూ బుధవారం ముఖ్యమంత్రిని కలవడం జరిగిందని పాడేరు శాసనసభ్యులు  భాగ్యలక్ష్మి  తెలిపారు. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని గ్రామాలు అనేకం ఉన్నాయని కొన్ని ప్రాంతాలు నుంచి మండల కేంద్రాలకు రావాలంటే గెడ్డలు దాటి రావాల్సిన పరిస్థితులు….. రాకపోకలు సాగించడం ఆయా గ్రామాల వారికి కష్టతరంగా మారుతుందని వీటి పరిష్కారానికి వంతెన నిర్మాణం ఒకటేనని ముఖ్యమంత్రి జగన్  తెలియజేయడం జరిగిందని భాగ్యలక్ష్మి అన్నారు. చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అక్కడ ప్రజలు అత్యవసర సమయాల్లో మండల కేంద్రాలకు, ఆసుపత్రులకు రావడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని డోలిమోతలు నిత్యం కనిపిస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు.

 మైదాన ప్రాంత తరహాలో గిరిజన ప్రాంతంలో జగనన్న కాలనీల నిర్మాణానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిర్మాణ వ్యయం రెండింతలు అధికంగా అవుతున్న విషయాన్ని  సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని  తెలిపారు. కొన్ని గ్రామాలకు అయితే మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ఇసుక తరలించడానికే చాలా వ్యయం అవుతుందని దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సామర్థ్యాలు తక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని, రోజు గడవడమే కష్టంగా ఉన్న పేద వారంతా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పక్కా గృహాల నిర్మించుకోవాలని ఆశపడుతున్నారని వారి కలను నెరవేర్చేందుకు సహకారం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరినట్లుగా ఆమె తెలిపారు. సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉపముఖ్యమంత్రి పీడికి రాజన్న దొర, చెట్టి పాల్గుణ,  ధనలక్ష్మి, కళావతి ఉన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

నూతన పోలీసు స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి వనిత

రాజమండ్రి ఆస్పత్రి లో నకిలీ ధృవపత్రాలు!