in ,

నూతన పోలీసు స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి వనిత

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో ఆధునిక హంగులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి డా.తానేటి వనిత ప్రారంబిచారు. బుదవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం  ఎమ్మెల్యేలు నంబూరి శంకర రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు రేంజి డిఐజి పాలరాజు, ఎస్పి రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి  మాట్లాడుతూ… పల్నాడు జిల్లా లోని అచ్చంపేట పోలీస్ స్టేషన్ యొక్క ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నది. తెలంగాణా రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు సరిహద్దులలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండి మొత్తం 33 గ్రామాలు కలిగిన అచ్చంపేట మండలం యొక్క ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడుటకు మరియు శాంతిభద్రతల పర్యవేక్షణ కొరకు అచ్చంపేట పోలీస్ స్టేషన్ 1936 వ సంవత్సరంలో ప్రభుత్వం వారిచే య.4.29 సెంట్లు విస్తీర్ణం లో ఏర్పాటు చేయటం జరిగినది. ఆధునీకరణలో బాగంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల సిఫారసులు మేరకు పాత పోలీస్ స్టేషన్ స్థానంలో నూతన పోలీస్ స్టేషన్ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు మొత్తం 18.33 సెంట్లు విస్తీర్ణంలో రెండు అంతస్తులతో భవనం నిర్మించడం జరిగింది. ప్రజలకు పోలీస్ శాఖ తరపున మరిన్ని ఉత్తమ సేవలు అందించడానికి ప్రభుత్వం తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక విధానాలతో పోలీస్ శాఖను బలోపేతం చేస్తామని హోంమంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో హోంమంత్రి తానేటి వనిత తో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

మచ్చలేని నాయకుడు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి

సీఎం జగన్ దృష్టికి గిరిజన ప్రాంత సమస్యలు