Flipkart Big Billion Days Sale | ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డే సేల్ మొదలైంది..! ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు 80శాతం డిస్కౌంట్..!
Flipkart Big Billion Days Sale | పండగల సీజన్ మొదలైంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఇండియన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఎప్పుడు ఆఫర్‌ను ప్రారంభించే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. అదే సమయంలో దేశీయ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సైతం ‘బిగ్ బిలియన్ డే సేల్’ను తీసుకువచ్చింది. బుధవారం నుంచి సేల్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకు కార్డులపై పదిశాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఈఎంఐ ఆప్షన్లతో జరిగే కొనుగోళ్లపై పదిశాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్లతో కొనుగోళ్లపై డిస్కౌంట్స్ సైతం లభించనున్నాయి.
అలాగే నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్ఛేంజ్‌పై ఆఫర్లు సైతం ఫ్లిప్‌కార్ట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. యాపిల్ ఐ-ఫోన్, ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మీ, షియోమీ తదతర మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై సైతం ఆఫర్ వర్తించనున్నది. ఆపిల్, శాంసంగ్, గూగుల్, రియల్‌మీ, ఒప్పొ, షియోమీ, వివో, నథింగ్ తదితర బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై 80శాతం వరకు డిస్కౌంట్ వర్తించనున్నది. మోటో జీ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ, రియల్‌మీ సీ 51, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11ఎక్స్ 5జీ, ఇన్ ఫినిక్స్ జీరో 30 5జీ, మోటో జీ84 5జీ, వివో వీ 29ఈ, పోకో ఎం6 ప్రో 5జీ మోడల్స్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ప్రకటించింది. వీటితో పాటు ఐఫోన్ 14, 13 సిరీస్ ఫోన్లపై సైతం మరింత తగ్గింపు ఉండనున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రాపై అన్ని ఆఫర్లతో కలిసి రూ.92వేల వరకు డిస్కౌంట్ లభించనున్న
ది.
This post was created with our nice and easy submission form. Create your post!