విచారించనున్న జస్టిస్ ఎస్వీ భట్టి మన తెలుగువారే!
చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం
జస్టిస్ ఎస్వీ భట్టిది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి
ఉదయం 11.30 గంటలకు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలను వినిపించనున్నారు. సిద్ధార్థ్ లూథ్రా నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుండగా, హరీశ్ సాల్వే ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించబోతున్నారు.
మరోవైపు జస్టిస్ ఎస్వీ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి) ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో… ఆయన ‘నాట్ బిఫోర్ మీ’ తీసుకునే అవకాశం కూడా ఉంది. జస్టిస్ ఎస్వీ భట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు.
This post was created with our nice and easy submission form. Create your post!