6 Comments
Leave a ReplyLeave a Reply
You must be logged in to post a comment.
Don't have an account? Register
Enter your account data and we will send you a link to reset your password.
To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%
AcceptHere you'll find all collections you've created before.
good morining sir
Good afternoon sir
Hi sir
పత్రికాప్రకటన తేదిః 19-09-2023
కరీంనగర్ జిల్లా
గణేష్ నిమజ్జనానికి పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి
మంత్రి గంగుల
నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్, లైటింగ్, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి
గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలి
.
. 0 0 0 0
జిల్లాలో ఈ నెల 27,28 తేదీల్లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు..
మంగళవారం పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తో కలిసి వినాయక నిమజ్జనం జరుపే కొత్తపల్లి చెరువు,చింతకుంట కెనాల్ మరియు మానకొండూర్ చెరువులను సందర్శించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ట్ తో కలసి పరిశీలించారు.. ఈ సందర్భంగా నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, పెద్ద క్రేన్లు, చిన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గజఈతగాల్లతో పాటు వాటంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 27 రాత్రి నుండి 28వ తేది ఉదయం వరకు జరిగే నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సజావుగా జరిగడంతో పాటు నిమజ్జనం తరువాత విగ్రహలతో సమస్యలు తలెత్తకుండ తగిన చర్యలు తీసుకునేల ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు.చింతకుంటలో రెండు క్రేన్లు, కొత్తపల్లి లో రెండు, మాంకొందుర్ వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్ డి ఓ కె. మహేశ్వర్ డిపిఓ వీరబుచ్చయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, ఎసిపిలు కరుణాకర్ రావు, నరేందర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, మానకొండూరు జడ్పిటిసి శేఖర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, పోలీస్,ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గోన్నారు.
మండలం కేంద్రమైన రెంటచింతల లోని పలు గ్రామాలలో జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. వైద్యం అంతంత మాత్రం ఉండటంతో గవర్నమెంట్ హాస్పిటల్ లో వసతులు సరిగా లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి చేరడం జరుగుతుంది, ప్రవేట్ హాస్పిటల్ వచ్చిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక లేదా ప్రజలు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
భవ్యశ్రీ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన విద్యార్ధిని ని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా నాయకులు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు ఏ క్కడో హైదరాబాద్ లో సంఘ్టన జరిగితే ఈ క్కడ అదే పేరుమీద చట్టం చేశారు కానీ ఆంద్రప్రదేశ్ లో మహిళ పైన హత్యలు హత్యాచారాలు జరుగుతున్న త్వరగా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోవడంలేదు అందు వల్లే ఈటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి,వెంటనే ప్రభుత్వం భవ్యశ్రీ ని హత్యాచారం చేసి హత్యచేసి న దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షపడేటట్టు చేస్తే ప్రజలలో ఈ ప్రభుత్వం పై విశ్వాసం ఉంటుంది లేదంటే కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు గా మిగిలిపోతారు, ఆంద్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగితే ప్రభుత్వం కఠినంగా శిక్షస్తుంది అని ప్రజలకు నమ్మకం కలుగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వ నికి ఉంది అని గుర్తు చేస్తూన్నాము అని అన్నారు