in

రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న హ్యాపీడేస్.. మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా..?


వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా మెయిన్ రోల్స్ లో నటించిన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ హ్యాపీడేస్. 2007 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాల్లో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది విద్యార్థులు ఈ సినిమాలో విధంగానే బిటెక్ చదవాలని.. అలాంటి హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కలలు కన్నారు.

అయితే ఈ సినిమాలో రీ రిలీజ్ చేయాలా అంటూ ప్రస్తుతం నిఖిల్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది ప్రేక్ష‌కులు సినిమా రిలీజ్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. హ్యాపీ డేస్ మూవీని రీ రిలీజ్ చేస్తే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో తెలియాలి. నిఖిల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హ్యాపీ డేస్ మూవీ రిలీజ్‌కు సంబంధించిన డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాడట.

ఈ తరం ప్రేక్షకులు సైతం హ్యాపీడేస్ మూవీని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు అంటూ నిటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కార్తికేయ 2, 18 పేజర్ సినిమాలతో భారీ విషయాలను సొంతం చేసుకున్న నిఖిల్ కు స్పై సినిమాతో చుక్క ఎదురయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక నిఖిల్ తర్వాత నటించబోయే త‌న సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడు చూడాలి.


Report

What do you think?

Newbie

Written by Naga

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

భారత్ విశ్వమిత్రగా అవతరించింది: మోదీ

డ్రగ్స్ కేసులో నవదీప్.. ఏం జరగనుంది?