MLA Ganta Srinivasa Rao: చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఏకమవుతున్నారని అన్నారు. పరిపాలనా సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు చంద్రబాబుగా అండగా నిలిచేందుకు వేలాదిగా ముందుకు వస్తున్నారని గంటా అన్నారు. ఆర్ధిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే ఎలా వుంటుందో చూస్తూనే ఉన్నాం. 16 నెలలు జైల్లో వున్న జగన్ శాడిజంతో చంద్రబాబును కావాలనే జైలుకు పంపారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.